Share News

అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:16 AM

మండలంలోని ఎల్‌కేఎస్‌.పురం గ్రా మానికి చెందిన బెహరా గజేంద్ర(31) అప్పుల బాధ తాళలేక గురువారం ఆత్మహ త్య చేసుకున్నాడని హెచ్‌సీ పాపారావు తెలిపారు.

అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య

లక్కవరపుకోట, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్‌కేఎస్‌.పురం గ్రా మానికి చెందిన బెహరా గజేంద్ర(31) అప్పుల బాధ తాళలేక గురువారం ఆత్మహ త్య చేసుకున్నాడని హెచ్‌సీ పాపారావు తెలిపారు. మృతుని భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గజేంద్ర.. గత కొన్నేళ్ల కిందట దేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు ఎల్‌కేఎస్‌.పురంలో సహజీవ నం చేస్తున్నారు. గజేంద్ర సోంపురంలోని అట్టల కంపెనీలో పనిచేస్తూ కుటుంబా న్ని పోషిస్తున్నాడు. అప్పుల ఎక్కువగా ఉండడంతో మనస్తాపానికి గురై గురువా రం ఉరివేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పాపారావు తెలిపారు.

Updated Date - Mar 20 , 2026 | 12:16 AM