అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:11 AM
అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసు కుంది.
దత్తిరాజేరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసు కుంది. స్టేషన్ బూర్జవలస పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్.చింతవలస గ్రామానికి చెందిన బొత్స గంగరాజు(44) వ్యవ సాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు చేసి మదుపులు పెట్టాడు. నష్టం రావడంతో మనస్తాపం చెందాడు. ఈక్రమంలో తన పొలంలో శనివారం సాయంత్రం గడ్డి మందు తాగాడు. అటుగా వెళ్లిన స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే 108లో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. గంగరాజుకు భార్య సంతోషి, కుమారులు మోహన్, వినోద్ ఉన్నా రు. కుమారుడు మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.