Share News

అప్పుల బాధ తాళలేక..

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:10 AM

మండలంలోని వెంపడాం గ్రామానికి చెందిన రౌతు జోగినాయుడు(52) అనే వ్యక్తి అప్పులబాధ తాళలేక పురుగు మం దు తాగి మృతిచెందాడు.

అప్పుల బాధ తాళలేక..

  • పురుగు మందు తాగి వ్యక్తి మృతి

పూసపాటిరేగ, జూలై 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంపడాం గ్రామానికి చెందిన రౌతు జోగినాయుడు(52) అనే వ్యక్తి అప్పులబాధ తాళలేక పురుగు మం దు తాగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగి నా యుడు ఒక ప్రైవేటు పరిశ్రమలో రోజువారి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అప్పుల బాధ తాళ లేక మంగళవారం ఉదయం ఇంటి మేడపైకి వెళ్లి పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడిఉన్న అతన్ని.. అతని ఇంటికి ఎదురుగా ఉన్న సత్యనారాయణ చూసి, ఇంట్లో వారికి తెలియజేశాడు. దీంతో కుటుంబీకులు జోగినాయుడును సుందరపేట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆయన మృతిచెందాడు. మృతుడికి భార్య అప్పలకొండతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు కూడా ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:11 AM