Share News

అప్పుల బాధ తాళలేక..

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:14 AM

అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

అప్పుల బాధ తాళలేక..

బొండపల్లి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ని దేవుపల్లి గ్రామానికి చెందిన మురపాల బంగారునాయు డు(45) స్వగ్రామంలో ఇల్లు కట్టుకుని, గత కొన్ని సంవత్సరా లుగా విశాఖపట్టణంలో ఆటో డ్రైవింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈయనకు భార్య పార్వతి తోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ఈయన అప్పుల బాధ తాళలేక గురువారం స్వగ్రామం వచ్చి పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు విషయాన్ని గమనించి, గజపతినగరంలోని వంద పడకల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మృతిచెందారు. మృతదేహానికి పంచనామా నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో మధ్యాహ్నం వరకు కుటుంబీకులు పడిగాపులు కాశారు. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌ లో విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 11 , 2026 | 12:14 AM