Share News

కడుపునొప్పి తాళలేక.. ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:50 AM

కడుపునొప్పి తాళలేక తపాలా శాఖ ఉద్యోగి కల్లేపల్లి గణపతి (39) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కడుపునొప్పి తాళలేక.. ఉద్యోగి ఆత్మహత్య

పాలకొండ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కడుపునొప్పి తాళలేక తపాలా శాఖ ఉద్యోగి కల్లేపల్లి గణపతి (39) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మం డలంలోని కొండాపురానికి చెందిన గణపతి శ్రీకాకుళంలోని హెడ్‌పోస్టాఫీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భార్య నిరోషా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గణపతి ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉండ డంతో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్తాపం చెందారు. ఈ నెల 11న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గడ్డిమందు సేవించాడు. ఆయనకు శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉద యం 6.30 గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతుడికి భార్య నిరోషా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అప్పుల బాధ తాళలేక ఒకరు..

గుర్ల, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జమ్ముపేటకు చెందిన కె.దాలినాయుడు(33) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాలినాయుడు గత కొంతకాలంగా మద్యం తాగుతూ తిరిగేవాడు. ఒక వైపు అప్పులు, ఇంకో వైపు ఇంట్లో బాధలు భరించలేక శుక్రవా రం ఉదయం పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కుటుం బీకులు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:50 AM