Share News

Ugadi Festive ఉగాది శోభ

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:22 AM

Ugadi Festive Splendor తెలుగు సంవత్సరాది ఉగాదిని వైభవంగా జరుపుకు నేందుకు జిల్లావాసులు సన్నద్ధమయ్యారు. గురువారం కొత్త అమావాస్య (ఉగాది) కావడంతో ఇందుకు అవసరమైన పూజా సామగ్రిని బుధవారమే కొనుగోలు చేశారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు మామిడి కాయలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేపపువ్వులు, చెరుకు తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో ప్రధాన మార్కెట్లన్నీ కళకళలాడాయి.

Ugadi Festive ఉగాది శోభ
కిటకిటలాడుతున్న పాలకొండ మార్కెట్‌

  • పూజా సామగ్రి కొనుగోలు చేసిన ప్రజలు

  • నేడు జిల్లావ్యాప్తంగా తెలుగు సంవత్సరాది వేడుకలు

  • ఏరువాకకు రైతులు సన్నద్ధం

పార్వతీపురం/పాలకొండ, మార్చి18(ఆంధ్రజ్యోతి): తెలుగు సంవత్సరాది ఉగాదిని వైభవంగా జరుపుకు నేందుకు జిల్లావాసులు సన్నద్ధమయ్యారు. గురువారం కొత్త అమావాస్య (ఉగాది) కావడంతో ఇందుకు అవసరమైన పూజా సామగ్రిని బుధవారమే కొనుగోలు చేశారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు మామిడి కాయలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేపపువ్వులు, చెరుకు తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో ప్రధాన మార్కెట్లన్నీ కళకళలాడాయి. వివిధ షాపులన్నీ రద్దీగా మారాయి. కాగా ఈ ఏడాది పొగమంచు ప్రభావంతో జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా అనుకున్న స్థాయిలో మామిడి కాయలు లేవు. చిన్న పిందెలు మాత్రమే మార్కెట్‌లో కని పించాయి. అయితే డిమాండ్‌ కారణంగా ఒక్కో కాయను రూ.20 వరకు విక్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు వాటినే కొనుగోలు చేశారు. మొత్తంగా పాలకొండ, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో సందడి వాతావరణం కనిపించింది. మరోవైపు రైతులు ఉగాది ఏరువాక (ఏరుపూత) నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు ఉదయం 7.22 గంటలకు ఏరువాక, ఇతర పూజలు నిర్వహించేందుకు శుభగడియలని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో నేడు పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లాకేంద్రంలో వేడుకలు ..

పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని మన్యం కళావేదికలో గురువారం ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం సంబంఽధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు ప్రజలు తరలిరావాలని కోరారు.

నేడు తోటపల్లిలో...

గరుగుబిల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల్లో గురువారం ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో బి.శ్రీనివాస్‌, చైర్మన్‌ ఎం.పకీరునాయుడు తెలిపారు. బుధవారం వారు స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆవరణలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోదండరామస్వామి దేవస్థానంలో నేటి నుంచి 27 వరకు వసంత నవరాత్రి మహోత్సవాలు జరపనున్నట్లు తెలిపారు. శ్రీరామ నవమిని పురస్కరిం చుకుని దేవస్థానం పరిధిలో ఈ నెల 27న సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో పాల్గొనే దంపతులు ముందుగా రూ. 500 చెల్లించాలని తెలిపారు.

శంబర పోలమాంబ దేవాలయంలో ...

మక్కువరూరల్‌, మార్చి18(ఆంధ్రజ్యోతి): శంబర పోలమాంబ దేవాలయంలోనూ గురువారం ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో బి.శ్రీనివాస్‌ బుధవారం విలేఖర్లకు తెలిపారు. చదురుగుడిలో ఉదయం 9గంటలకు బంకుపల్లి లక్ష్మీనరసింహశర్మతో పంచాంగ శ్రవణం జరుగు తుందని వెల్లడించారు. భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే ఉదయం 10గంటలకు చదురుగుడిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలతో పాల్గొనొచ్చని చెప్పారు.

Updated Date - Mar 19 , 2026 | 12:22 AM