బస్సు కిందకు దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:21 AM
మండలంలోని ఎంకే వలస వద్ద సోమవా రం జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం బస్సు టైరు కిందకు దూసుకు పోయింది.
ప్రాణాలతో బయటపడిన వాహనచోదకుడు
జామి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎంకే వలస వద్ద సోమవా రం జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం బస్సు టైరు కిందకు దూసుకు పోయింది. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనచోదకుడు గాయాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎంకే వలస గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తన గ్రామం నుంచి కుమారాం రోడ్డుకు వస్తున్నాడు. ఈక్రమంలో అక్కడ ఉన్న మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని తిప్పా డు. ఇంతలో అదే సమయంలో విజయనగరం నుంచి అనకాపల్లి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. దీంతో ఆ వ్యక్తి ద్విచక్రవాహనంతో పాటు బస్సు టైర్ ముం దు పడిపోయాడు. ద్విచక్రవాహనం టైర్ కిందకు వెళ్లి నుజ్జయ్యింది. ఆ ఘటన చూసి న స్థానికులు సదరు వ్యక్తి చనిపోయాడని భావించారు. కానీ ఆయన గా యాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే ఆయన్ని విజయనగరం ఆసుపత్రికి తరలిం చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వైవీ జనార్దన్ ఘటనా స్థలానికి చేరుకుని, బస్సు టైర్ కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని పరిశీలించారు. ప్రమాదం పై ఆరా తీశారు. సదరు వ్యక్తికి నుదిటిపై చిన్నపాటి గాయం అయినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు.