ద్విచక్రవాహనం బోల్తా.. యువకుడి మృతి
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:40 AM
ద్విచక్రవాహనం బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు.
విజయనగరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనం బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై ఒకటవ పట్టణ పోలీసు లు సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి గ్రామానికి చెందిన కొయ్యాన దిలీప్(19) అనే యువకుడు ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్థానిక పీజీ స్టార్ ఆసుపత్రి ఎదురుగా అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన దిలీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి అన్నయ్య కొయ్యాన జానకిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ రామారావు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని పోలీసు లు తెలిపారు.