ద్విచక్రవాహనం బోల్తా
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:28 AM
ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఒక మహిళకు ప్రమాదం తప్పింది.
స్పృహ కోల్పోయిన మహిళకు సీపీఆర్ చేసిన కానిస్టేబుల్
తప్పిన ప్రమాదం
దత్తిరాజేరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఒక మహిళకు ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెదమానాపురం నుంచి విజయనగరం వైపు ఇద్దరు వ్యక్తులతో వస్తున్న ద్విచక్రవాహనం పెదమానాపురం పోలీసుస్టేషన్ ఎదురుగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై వెనుకన కూర్చున్న సుస్మిత అనే మహిళ స్పృహ కోల్పోయింది. వెంటనే పెదమానాపురం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ కె.అప్పన్న స్పందించి మహిళకు సీపీఆర్ చేయడంతో ఆమె స్పృహలో కి వచ్చింది. వెంటనే మహిళను ప్రథమ చికిత్స నిమిత్తం 108లో గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమ్తితం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.