డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:50 PM
జాతీయ రహదారిపై బీహెచ్‌పీవీ జంక్షన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతిచెందగా మరో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి.
ఒక విద్యార్థిని మృతి, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు
అక్కిరెడ్డిపాలెం (విశాఖ సిటీ), మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై బీహెచ్‌పీవీ జంక్షన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతిచెందగా మరో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తుని పట్టణాని కి చెందిన ఆడారి మహాలక్ష్మి (20), పార్వతీపురానికి చెందిన చిప్పాడ అనూష కాకినాడలో ఇటీవల డిప్లొమా (పాలిటెక్నిక్) పూర్తిచేశారు. విశాఖలోని ‘భెల్-హెచ్‌పీవీపీ’లో (బీహెచ్‌పీవీ) ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. షీలానగర్‌లో ఒక రూమ్ అద్దెకు తీసుకుని వుంటారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భోజనం చేయడానికి ద్విచక్ర వాహనంపై గాజువాక బయలుదేరారు. దారిలో బీహెచ్‌పీవీ సబ్‌స్టేషన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌పై వున్న విద్యు త్ స్తంభాన్ని బలంగా ఢీకొన్నారు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికు లు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహాలక్ష్మి చికిత్స పొందుతూ మృతిచెందింది. అనూష్ పరిస్థితి ఆందోళ నకరంగానే వుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.