Share News

వ్యాన్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:31 AM

వ్యాన్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టి న ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా, మరో యువకుడికి గాయాల య్యాయి.

 వ్యాన్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

  • ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

కొత్తవలస, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): వ్యాన్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టి న ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా, మరో యువకుడికి గాయాల య్యాయి. ఈ ఘటనపై సీఐ టీవీ విజయ్‌కుమార్‌ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, గుమ్మ పంచాయతీ, చెరుకుబిడ్డ గ్రామానికి చెందిన బిడ్డ చరణ్‌తేజ్‌(21) విశాఖపట్నం లోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. చరణ్‌తేజ్‌, తన స్నేహితుడు బిడ్డ రాజ్‌కుమార్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి ద్విచక్ర వాహనంపై కొత్తవలస మీదుగా స్వగ్రామానికి వెళ్తున్నారు. మండలంలోని నిమ్మలపాలెం దాటిన తర్వాత రోడ్డు పక్కన నిలిపిఉన్న వ్యాన్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న చరణ్‌ తేజ్‌ తలకు బలమైన గాయం కాగా, వెనుక కూర్చున్న రాజ్‌కుమార్‌ ఎడమ కాలికి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చరణ్‌తేజ్‌ మృతిచెందాడు. మృతుడి తండ్రి దేముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 16 , 2026 | 12:31 AM