Share News

రెండు ద్విచక్రవాహనాలు ఢీ

ABN , Publish Date - May 26 , 2026 | 11:53 PM

మండలంలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.

 రెండు ద్విచక్రవాహనాలు ఢీ

రేగిడి, మే 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గా యాలయ్యాయి. స్థానికులు, 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి మండలం పోరాం గ్రామానికి చెందిన దంపతులు హరనాథ్‌, సత్యవ తిలు ఇదే మండలం కొర్లవలసలో ఒక పరామర్శకు ద్విచక్రవాహనంపై వెళ్తు న్నారు. ఎదురుగా మరో ద్విచక్ర వాహనంపై వంగర మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పడాల మురళి, ఆయన తల్లి రత్నంలు రాజాం నుంచి వం గర వైపు వస్తున్నారు. ఈ రెండు వాహనాలు కాగితాపల్లి సమీపంలోకి వచ్చే సరికి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సత్యవతికి తీవ్ర గాయాలు కాగా, ఆమె భర్త హరనాథ్‌కు కాలు విరిగింది. ఇదే ఘటనలో పడా ల మురళి, రత్నంలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రు లను 108 వాహనంలో రాజాం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

Updated Date - May 26 , 2026 | 11:53 PM