రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:50 PM
మండలంలోని గూడెం జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.లక్ష్మణరావు, పుష్ప అనే ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి.
ఒకరి పరిస్థితి విషమం
గుర్ల, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని గూడెం జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.లక్ష్మణరావు, పుష్ప అనే ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. పీఆర్.పేట గ్రామానికి చెందిన వీరు ఆదివారం ఉదయం విజయన గరం నుంచి తమ స్వగ్రామానికి బైకుపై వస్తుండగా.. ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిద్దరినీ స్థానికులు 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావు పరిస్థితి విషమిం చడంతో విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించారు. పుష్పకు కొద్దిపాటి గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.