Two more industries for the district జిల్లాకు మరో రెండు పరిశ్రమలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:01 AM
Two more industries for the district
జిల్లాకు మరో రెండు పరిశ్రమలు
కొత్తవలస, గుర్ల మండలాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపు
మంత్రి మండలి ఆమోదం
విజయనగరం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లాకు పరిశ్రమల పరంగా మహర్దశ పట్టింది. ఇప్పుడిప్పుడే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరో రెండు పరిశ్రమల కోసం భూ కేటాయింపులకు అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీ పరిధిలో ఏపీఐఐసీ వారి వద్దనున్న భూములను గణేష్ సాయి లాజిస్టిక్ కంపెనీకి కేటాయించింది. ఈ కంపెనీ స్టీల్‌రోప్స్ యూనిట్ ఏర్పాటు చెయ్యాటానికి గతంలో ప్రతిపాదనలు పంపగా.. 7.50 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి తాజాగా ఆమోదం తెలిపింది.
- గుర్ల మండలం తాతావారి కిత్తలి గ్రామంలో మెస్సర్స్ ఎఫ్‌ఫీఈఎల్ రాయ్‌వేద పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 80 మెగా వాట్స్ ఎసీ/120 మెగా వాట్స్ పీడీసీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి లభించింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీని ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.