Share News

రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:28 AM

జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

  రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

భోగాపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీని శ్రీకాకుళం నుంచి ఐరన్‌ ఓర్‌ పార్సిల్స్‌ విశాఖ నుంచి వస్తున్న ట్రాలీలారీ డివైడర్‌ పైనుంచి వెళ్లి ఢీకొట్టింది. అవనాం జంక్షన్‌ ఎత్తు బ్రిడ్జి దిగువన జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ డ్రైవర్‌ సురేష్‌రా య్‌(61) లారీ కేబిన్‌లో ఇరుక్కొని మృతిచెందాడు. ట్రాలీలారీ జాతీయ రహదారికి అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకు న్న సీఐ దుర్గాప్రసాదరావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేశారు. అనంతరం లారీలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టు నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. అయితే ట్రాలీలారీకి చెందిన డ్రైవర్‌, క్లీనర్‌ భయాందోళనలకు గురై అక్కడ నుంచి వెళ్లిపోయి.. సాయంత్రానికి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీనిపై ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:28 AM