Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:09 AM

చింతలపాలెం శివారు గొల్లపేట సమీపంలోని కొత్తవలస-విశాఖపట్టణం రోడ్డులో గల మలుపు వద్ద శనివారం సాయంత్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కొత్తవలస, జనవరి 31(ఆంధ్రజ్యోతి): చింతలపాలెం శివారు గొల్లపేట సమీపంలోని కొత్తవలస-విశాఖపట్టణం రోడ్డులో గల మలుపు వద్ద శనివారం సాయంత్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. విశాఖపట్టణం నుంచి కొత్తవలస వైపు వస్తున్న కారు.. ఎస్‌.కోట నుంచి విశాఖపట్టణం వైపు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివ అనే యువకుడికి కాలు విరిగిపోగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరూ మ్యాన్‌ కైండ్‌ కంపెనీకి చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లుగా పని చేస్తున్నారు. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం విశాఖపట్టణం తరలించారు.

Updated Date - Feb 01 , 2026 | 12:09 AM