దాడి ఘటనలో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:09 AM
కొందరు వ్యక్తులు ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన శనివారం తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది.
సంతకవిటి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కొందరు వ్యక్తులు ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన శనివారం తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాలాడ గ్రామానికి చెందిన కుప్పిలి వెంకటరమణ పులిట గ్రా మంలో జరిగిన ఓ చావు కార్యానికి వెళ్లగా, అక్కడ మద్యం తాగిన కొందరు గొడ వపడటంతో వారిని విడిపించాడు. అనంతరం తాలాడ గ్రామంలోని వెంకట రమణ ఇంటి వద్దకు రాగోలు చరణ్, సవలాపురపు పాల్‌బాబు, ఆదినారాయణ, రాగోలు సురేష్, కిరణ్, కుప్పిలి అసిరయ్యలు వచ్చి అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరమణతో పాటు అతని తమ్ముడు సురేష్‌కు గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఆర్.గోపాలరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.