Share News

రెండు పూరిళ్లు దగ్ధం

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:43 PM

రాజులరామచంద్రా పురం పంచాయతీ లింగరాజపు రం గ్రామంలో శుక్రవారం తెల్ల వారుజామున రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

రెండు పూరిళ్లు దగ్ధం

దత్తిరాజేరు, ఫిబ్రవరి 20(ఆం ధ్రజ్యోతి): రాజులరామచంద్రా పురం పంచాయతీ లింగరాజపు రం గ్రామంలో శుక్రవారం తెల్ల వారుజామున రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కెల్ల సింహాచలమమ్మ, రెడ్డి చిన్నమ్మిల కు చెందిన పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. చలికి పెట్టుకున్న కుంపటి వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఆస్తినష్టం రూ.2లక్షలు ఉండవచ్చునన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ప్లాస్టిక్‌ దుకాణం..

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని పెద్దచెరువు రోడ్డు టింబర్‌ డిపో సమీపంలో ఓ ప్లాస్టిక్‌ దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్టు జిల్లా అగ్నిమాపక సహాయ అధికా రి సోమేశ్వరావు తెలిపారు. తెల్లవారుజామున మంటలు వ్యాపించినట్టు స్థానికు ల నుంచి సమాచారం రావటంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో ఘ టనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఈ ప్ర మాదంలో సుమారు రూ.10లక్షలు ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.

Updated Date - Feb 20 , 2026 | 11:43 PM