రెండు కార్లు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - May 13 , 2026 | 12:29 AM
మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాల య్యాయి.
దత్తిరాజేరు, మే 12(ఆంధ్రజ్యో తి): మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాల య్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివ రాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్ట ణం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఒక కారు, రామభద్రపురం నుంచి విజయన గరం వెళ్తున్న మరొక కారు ఎదురెదురుగా వస్తూ షికారుగంజి జంక్షన్ వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో పార్వతీపురం చర్చివీధికి చెందిన హనుమంతు జయరాజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని స్టేషన్ బూర్జివలస ఎస్‌ఐ జి.రాజేష్ పరిశీలించారు.