Share News

ఇద్దరు సోదరులపై తమ్ముడి దాడి

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:25 AM

ఆస్తి వివాదంలో తోడబుట్టిన ఇద్దరు అన్నయ్య లపై ఓ తమ్ముడు చాకుతో దాడి చేసిన ఘటన మండ లంలోని కొండకిండాం గ్రా మంలో సోమవారం చోటు చేసుకుంది.

ఇద్దరు సోదరులపై తమ్ముడి దాడి

  • ఒకరి పరిస్థితి విషమం

బొండపల్లి, మార్చి 30(ఆం ధ్రజ్యోతి): ఆస్తి వివాదంలో తోడబుట్టిన ఇద్దరు అన్నయ్య లపై ఓ తమ్ముడు చాకుతో దాడి చేసిన ఘటన మండ లంలోని కొండకిండాం గ్రా మంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బొండపల్లి ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండకిండాం గ్రామానికి చెందిన కలిశెట్టి రామునాయుడు, చిన్నప్పలమ్మలకు ముగ్గురు కుమారులు కలిశెట్టి సత్య నారాయణ, బంగారునాయుడు, గౌరినాయుడు ఉన్నారు. రామునాయుడు పదేళ్ల కిందట మృతిచెందగా, చిన్నప్పలమ్మ ఐదేళ్ల కిందట మృతిచెందింది. అయితే తల్లి చిన్నమ్మకు సంబంధించిన భూమితో పాటు బంగారం విషయమై తరచూ అన్నద మ్ముల మధ్య వివాదం నడుస్తోంది. సోమవారం కూడా వీరి మధ్య తగాదా చోటు చేసుకుంది. గౌరినాయుడు తన వెంట తెచ్చుకున్న చాకుతో అన్నయ్య అయిన సత్యనారాయణ పొట్టలో పొడిచాడు. దీంతో ప్రేగులు బయటకు వచ్చాయి. పక్కనే ఉన్న మరో అన్నయ్య బంగారునాయుడు చాతిపై కూడా చాకుతో పొడిచాడు. తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ అక్కడే వదిలేసి.. పరారీ అయ్యా డు. బంగారునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశా రు. ఈ ఘటనలో సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయ పడిన ఇద్దరినీ జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీంతో పాటు ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ టీం పోలీసులు పరిశీలించారు. దాడికి సంబంధించిన వివరాలను సేకరించారు.

Updated Date - Mar 31 , 2026 | 12:25 AM