Share News

BLOs Suspended ఇద్దరు బీఎల్‌వోల సస్పెన్షన్‌

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:13 AM

Two BLOs Suspended ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు బీఎల్‌వోలను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. ఆ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

 BLOs Suspended ఇద్దరు బీఎల్‌వోల సస్పెన్షన్‌

పార్వతీపురం, జూన్‌28(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు బీఎల్‌వోలను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. ఆ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురంలో 18వ నెంబర్‌ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో బీఎల్‌వో కె.వినయ్‌కుమార్‌ ఎన్యుమరేషన్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియను సక్రమంగా చేయడం లేదు. వేగవంతం చేయాలని తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక మక్కువ మండలం కాశీపట్నం సచివాలయ పరిధి 25వ నెంబర్‌ పోలింగ్‌ స్టేషన్‌ బీఎల్‌వో పి.నవీన్‌ కూడా డిజిటలైజేషన్‌లో ఎటువంటి ప్రగతి సాధించ లేదు. దీంతో ఈ నెల 27న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా ఆయనకు ఫోన్‌ చేశారు. అయితే మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అందుబాటులో లేకుండా ఉండడంతో జిల్లాలో ఇరువురు బీఎల్‌వోలను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. కాగా మన్యంలో ఇప్పటివరకు ఎన్యుమరేషన్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ 12.66 శాతం పూర్తయింది. జిల్లాలో 7,90,562 మంది ఓటర్లు ఉండగా.. 1032 మంది బీఎల్‌వోల ద్వారా ఫారాల పంపిణీ చేపట్టారు. ఇంతవరకు 7,48,382 మందికి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించారు.

Updated Date - Jun 29 , 2026 | 12:13 AM