రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:21 AM
నరపాం సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
కొత్తవలస, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): నరపాం సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, దేవరాపల్లి గ్రామానికి చెందిన కె.జగదీష్ తన ద్విచక్ర వాహనంపై సబ్బవరం వైపు వెళ్తుండగా.. ఎదురుగా మరో ద్విచక్ర వాహనంపై కొమ్మాదికి చెందిన నవీన్, పెందుర్తి మండలం చిన ముషిడివాడకు చెందిన హరీష్‌లు వస్తున్నారు. నరపాం సమీపంలోకి వచ్చేసరికి ఈ రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వియ్యంపేట పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం 108 వాహనంలో విశాఖపట్నం తరలించారు.