రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:06 AM
దయానిధిపురం సమీపంలో ఆది వారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
సీతానగరం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): దయానిధిపురం సమీపంలో ఆది వారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూనుబుచ్చంపేట గ్రామానికి చెందిన పైలు గురువులు(60) గాదెలవలస నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో సీతానగరం నుంచి ఆవాల వలసకు పి.హరినాఽథ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రెండు బైక్‌లు ఎదు రెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గురువులు తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే మృతి చెందారు. హరినాథ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసు కున్న ఎస్‌ఐ హేమలత ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.