రె ండు బైకులు ఢీ.. నలుగురికి గాయాలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:59 PM
ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
రేగిడి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పాలకొండ- రాజాం రోడ్డులో గల చిన శిర్లాం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రేగిడి మండలం చిన్నయ్యపేటకు చెందిన సవిరిగాన సింహాద్రినాయుడు తన భార్య శ్రీలత, కుమారుడు రోహిత్ కలిసి కొత్త బట్టలు కొనేందుకు బైకుపై రాజాం వెళ్లి, తిరిగి వస్తున్నారు. అదే సమయంలో పాలకొండకు చెందిన కరణం గౌరినాయుడు బైకుపై ఎదురుగా రాజాం వైపు వెళ్తున్నాడు. వీరు చినశిర్లాం సమీపంలోకి వచ్చేసరికి, ఈ రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సింహాద్రినాయుడుకు తల భాగం, కాళ్లు దెబ్బతినగా, భార్య, కుమారుడుకి కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. తవిటినాయుడు చిన్నపాటి గాయాలతో బయట పడ్డాడు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌ఐ బాలకృష్ణ ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.