రెండు ఆటోలు ఢీ: 10 మందికి గాయాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:12 AM
బొద్దూరు గ్రామ సమీపంలో బుధవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది గాయ పడ్డారు.
సంతకవిటి, ఫిబ్రవరి 4 (ఆంధ్ర జ్యోతి): బొద్దూరు గ్రామ సమీపంలో బుధవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది గాయ పడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పాల ఆటో, ప్రయాణికుల ఆటో పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో చీపురుపల్లి మండలం జి.అగ్రహారం గ్రామానికి చెందిన చందక దుర్గమ్మ, పాటివాడ సురేష్, సి.పుష్ప తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు. అంబఖండిలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉండగా... బొద్దూరు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. రాజాం, రేగిడి 108 వాహనాలు అక్కడికి చేరుకొని ఈఎమ్‌టీలు ఏ .శ్రీనివాసరావు, ఎం.ఈశ్వరరావులు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటకు సంబంధించి బుధవారం రాత్రి వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెప్పారు.