గంజాయితో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:43 PM
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు కేరళవాసులను బొడ్డవర చెక్‌పోస్టు వద్ద మంగళవారం పట్టుకున్నామని ఎస్.కోట ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఎస్.కోట రూరల్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు కేరళవాసులను బొడ్డవర చెక్‌పోస్టు వద్ద మంగళవారం పట్టుకున్నామని ఎస్.కోట ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. కేరళ రాష్ట్రం ముంచపుల్లి హౌస్, పండి క్కడ గ్రామానికి చెందిన ముస్తాపా, శరత్‌లాలా.. ఒడిశా రాష్ట్రం పాడువ నుంచి 33 కిలోల 485 గ్రాముల గంజాయి తరలిస్తుండగా.. బొడ్డవర చెక్‌పోస్టు వద్ద గుర్తించి, పట్టుకున్నామని ఆయన చెప్పారు. వీరు ఈ గంజాయిని పాడువ నుంచి ఢిల్లీ తీసుకువెళ్తున్నట్టు గుర్తించామన్నారు. ఈమేరకు వీరిని అరెస్టు చేశామన్నారు.