చైన్‌స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:02 AM
ఓ శుభకా ర్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహ రించిన కేసులో ఇద్దరు నింది తులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి తెలిపారు.
విజయనగరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఓ శుభకా ర్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహ రించిన కేసులో ఇద్దరు నింది తులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి తెలిపారు. శనివారం విజయనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి పోలీస్‌స్టేషన్ పరిధిలో పొటిపి రెడ్డి రమణమ్మ అనే మహిళ ఈనెల 16న కుమరాం గ్రామంలో జరిగే ఓ గృహప్రవేశ కార్యక్రమా నికి హాజరయ్యారు. తిరిగి రమణమ్మ ఇంటికి వెళ్తుండగా.. భీమసింగి- విజయన గరం రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును లాక్కొని.. ద్విచక్ర వాహనంపై వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడ నుంచి పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశా రు. అనంతరం పోలీసులు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. నిందితులు గరికివలస కు చెందిన పొట్నూరు హరికృష్ట, సంగంరెడ్డి శివగణేష్‌లుగా గుర్తించారు. ఈమేర కు వారిని అరెస్టు చేశారు. ఈ నేరంలో ప్రమేయమున్న మూడో వ్యక్తి ఆవాల అప్పలనాయుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీసీఎస్ సీఐ డీడీ నాయుడు, ఎస్.కోట రూరల్ సీఐ హిమగిరి, జామి ఎస్‌ఐ వైవీ జనార్ధన్, సీసీఎస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.