బైక్‌ల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:07 PM
వీరఘట్టం పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు.
-ఐదు ద్విచక్ర వాహనాల స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ
పాలకొండ, సెప్టెం బరు 10 (ఆంధ్ర జ్యోతి): వీరఘట్టం పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. గురువారం స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వారి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరఘట్టం ఎస్‌ఐ షన్ముఖరావు సిబ్బందితో కలిసి మరియగిరి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి ఇద్దరు యువకులు తప్పిం చుకునేందుకు యత్నించారు. వారిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన పొందూరు మురళీకృష్ణ (22), బార్నాలవీధికి చెందిన చాట్ల చంద్రమౌళి (28)గా గుర్తించారు. వీరు కంబరవలస పశువుల ఆసుపత్రి వద్ద బైక్‌ను దొంగలించి మరుసటి రోజు పార్వతీపురం పరిసరాల్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మద్యానికి బానిసై డబ్బులు కోసం వివిధ ప్రాంతాల్లో బైక్‌లు దొంగిలించి కొన్ని విక్రయించగా మరికొన్నింటికి వ్యక్తిగతం గా వినియోగిస్తున్నారని విచారణలో వెల్లడైందన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు డోల వెంకన్న, షన్ముఖరావు, అమ్మారావు తదితరులు పాల్గొన్నారు.