Share News

జగ్జీవన్‌రామ్‌కు నివాళి

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:00 AM

దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికి కృషిచేసిన మహ నీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కొనియాడారు.

 జగ్జీవన్‌రామ్‌కు నివాళి

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికి కృషిచేసిన మహ నీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కొనియాడారు. భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే పూల మాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపప్రధానిగా, కేంద్రమంత్రి గా జగ్జీవన్‌రామ్‌ దేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. టీడీపీ నాయకులు విజ్జపు ప్రసాద్‌, ప్రసాదుల ప్రసా ద్‌, గంటా రవి, పీతల కోదండరామ్‌, పొగిరి పైడిరాజు పాల్గొన్నారు.

విజయనగరం కైం, ఏప్రిల్‌ 5 (ఆంధ్ర జ్యోతి): బాబూ జగ్జీవన్‌ రామ్‌ దళిత వర్గాల ఆశాజ్యోతి అని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నా రు. పట్టణంలోని మహి ళా పోలీసు స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన జగ్జీవ న్‌రామ్‌ జయంతి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని, ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించా రు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువ చ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పి.సౌ మ్యలత, ఏఆర్‌ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, సీఐలు ఇ.నర్సింహమూర్తి, ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, సీహెచ్‌ సూరినాయుడు, ఆర్‌ఐ పి.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, నివాళులు అర్పించారు.

Updated Date - Apr 06 , 2026 | 12:00 AM