ఆంధ్రకేసరికి నివాళి
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:36 AM
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా టంగుటూరి జయంతి
విజయనగరం, కలెక్టరేట్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి డీఆర్‌వో చందక సత్తిబాబు పూలమాలవేసి, నివాళుల్ప రించారు. డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, కలెక్టరేట్ ఏవో దేవిప్రసాద్, మార్క్‌ఫెడ్ డీఎం వెంకటేష్ పాల్గొ న్నారు.
చీపురుపల్లి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ని స్థానిక డీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి డీడీవో కె.హేమసుందరరావు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. డిప్యూటీ ఎంపీడీవో ఎం.అప్పల నాయుడు, మండల పరిషత్ కార్యాలయ ఏవో టి.ప్రవీణ్‌కుమార్, జూనియర్ సహాయకుడు కె.సురేష్ పాల్గొన్నారు.
రాజాం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో ఆయన చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ ఎ.రా మచంద్రరావు పూలమాల వేసి, నివాళులు అర్పించారు. మున్సిపల్ మేనేజరు ఎంవీ రమణ, ఏఈ పి.వెంకటరా మరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చేగొండి ప్రసాద్, ఆర్‌ఐ బోను శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.