మోకాళ్లపై గిరిజనుల నిరసన
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:20 AM
కొండగంగుబూడి పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను జీవనోపాధి నిమిత్తం తమకు అప్పగిం చాలని అదే పంచాయతీకి చెందిన 12 గ్రామాల గిరిజనులు గత ఏడు రోజులుగా నిరసన చేపడుతున్నారు.
చేపల చెరువులు అప్పగించాలని ఏడు రోజులుగా డిమాండ్
వేపాడ, జూలై 27(ఆంధ్రజ్యోతి): కొండగంగుబూడి పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను జీవనోపాధి నిమిత్తం తమకు అప్పగిం చాలని అదే పంచాయతీకి చెందిన 12 గ్రామాల గిరిజనులు గత ఏడు రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఈ నిరసనలో భాగంగా సోమవారం విజయరామసాగర్ గట్టుపై వారంతా మోకాళ్లపై కూర్చొ ని, ఆందోళన చేశారు. వీరికి రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్, మాజీ సర్పంచ్ చల్లా వెంకటరావులు మద్దతు ప్రకటించారు.