వంటావార్పుతో గిరిజనుల నిరసన
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:01 AM
మండలంలోని కొండగంగుబూడి ఎస్సీ, ఎస్టీ యువకులు ఉపాధి కల్పించాలని 15 రోజులుగా ఆందోళన చేపడుతున్నా జిల్లా అధికారులకు చీమకుట్టినట్టు లేకపోవడం దారుణమని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ ఆరోపించారు
వేపాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండగంగుబూడి ఎస్సీ, ఎస్టీ యువకులు ఉపాధి కల్పించాలని 15 రోజులుగా ఆందోళన చేపడుతున్నా జిల్లా అధికారులకు చీమకుట్టినట్టు లేకపోవడం దారుణమని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ ఆరోపించారు.బుధవారం బొద్దాం-కొండగంగుబూడి రోడ్డులో వంటావార్పు నిర్వహణలో భాగంగా భోజన ప్లేట్లు పట్టుకొని గిరిజనులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో చల్లా వెంకటరావు, పాతబోయిన అర్జున, కేదాటి గిరి, బోర అవతారం, పొట్నూరి.సంతోష్, కుమ్మరి గణేష్, నర్సింగరావు పాల్గొన్నారు.
-