Share News

కొఠియా గ్రామాల్లో గిరిజనులను

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:06 AM

‘కొఠియా గ్రామాలేమైనా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్నాయా? ఆంధ్రా-ఒడిశా మధ్యే కదా ఉన్నాయి.

కొఠియా గ్రామాల్లో గిరిజనులను
కొఠియా పరిధిలోని సారిక గ్రామంలో ఓటర్లతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

-ఇబ్బందులు పెడితే సహించం

- మీకు ఎన్నికలు ఇష్టంలేకపోతే ఈసీకి ఫిర్యాదు చేసుకోండి

- ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం

సాలూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘కొఠియా గ్రామాలేమైనా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్నాయా? ఆంధ్రా-ఒడిశా మధ్యే కదా ఉన్నాయి. మనం వేర్వేరు రాష్ట్రాలు అయినప్పటికీ ఒకే దేశంలో జీవిస్తు న్నాం. ఒడిశా అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమాయ కులైన గిరిజనుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం.’ అని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒడిశా ప్రభుత్వానికి, అధికారులకు స్ర్టాంగ్‌ వార్నిం గ్‌ ఇచ్చారు. కొఠియా పరిధి సారిక గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రా లను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్యనున్న 29 కొఠియా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ఒడిశా అధికారులు హింసాత్మక చర్యలకు పాల్పడడం సరైనది కాదన్నారు. ‘స్వాతంత్య్రం రాకముందు నుంచి ఇరు రాష్ట్రాల మధ్య కొఠియా గ్రామాల వివాదం ఉంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో స్టేటస్‌కో ఉంది. అయినప్పటికీ 60 సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో ఎన్నికల కమిషన్‌ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తోంది. దీనిపై ఎప్పుడూలేని అభ్యంతరాలు ఇప్పుడేంటి. గిరిజనుల చేతికి ఓటు వేసినట్లు సిరా చుక్క కనిపిస్తే తిరిగి వారిని గ్రామాలకు రాకుండా చేస్తాననడం సరైన పద్ధతి కాదు. ఆ 29 గ్రామాల గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. ఈ గ్రామాల్లో జరుగుతున్న హింసాత్మక చర్యలను, ఒడి శా ప్రభుత్వం, అధికారుల తీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించాలి. ప్రతీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు చెప్పే విధంగా, ఒడిశా దూకుడును ఆపే విధంగా నిర్ణయాలు తీసు కుంటాం. గిరిజనులే కదా అని చులకనగా చూస్తే బాగుండదు. అమా యకులైన ఐదుగురు గిరిజనులను ఒడిశా ప్రభుత్వం కిడ్నాప్‌ చేయడం దారుణం. వారిలో ఇద్దరు స్థానిక ఎన్నికల్లో పోటీచేసే ఎంపీటీసీలు కూడా ఉన్నారు. ఇలాంటి చర్యలను మానుకోవాలి.’ అని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంగా ఓటువేయడానికి వచ్చిన ఆయా గ్రామాల గిరిజనులను మంత్రి అభినందించారు. ‘మీరింటికి వెళ్లే వరకు మా భద్రతా బలగాలు మీకు తోడుగా ఉంటాయి.’అని భరోసా ఇచ్చారు. ఆమె వెంట టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్‌, నాయకులు ఉన్నారు. అనంతరం తాడిలోవ, బోగవలస పోలింగ్‌ కేంద్రాలకు మంత్రి వెళ్లి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు.

-సారిక గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత్‌ రహర్‌ గురువారం పరిశీలించారు. ఓటింగ్‌ శాతం ఎంత నమోదైందని పోలింగ్‌ అధికారులను అడిగారు. సాయంత్రం 4.30 గంటలకు 35.5 శాతం నమోదైందని, గతంలో ఎంత నమోదైందని అడుగగా 17.5 శాతం అని వారు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 01:06 AM