Share News

Malaria గిరిజన విద్యార్థికి మలేరియా

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:44 PM

Tribal Student Diagnosed with Malaria గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె.అఖిల్‌ అనే విద్యార్థి మలేరియా, రక్తహీనతతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఏటీడబ్ల్యూవో రజని కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు.

  Malaria గిరిజన విద్యార్థికి మలేరియా
కేజీహెచ్‌లో ఉన్న అఖిల్‌ ఆరోగ్యంపై ఆరా తీస్తున్న ఏటీడబ్ల్యూవో

గుమ్మలక్ష్మీపురం, జూలై3(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె.అఖిల్‌ అనే విద్యార్థి మలేరియా, రక్తహీనతతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఏటీడబ్ల్యూవో రజని కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. అక్కడి వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడి.. అఖిల్‌కు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలన్నారు. కాగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వెళ్లిన ఆ విద్యార్థి కొద్దిరోజుల తర్వాత స్వగ్రామం బయ్యాడకు వెళ్లిపోయాడు. ఇంటిలోనే ఉంటున్న అఖిల్‌ స్కూల్‌కు ఎందుకు రావడం లేదని వార్డెన్‌ వెంకటరావు వాకబు చేశారు. విద్యార్థికి జ్వరం అని తెలియడంతో ఆయన అక్కడకు చేరుకుని బుధవారం కురుపాం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అఖిల్‌కు పీఎఫ్‌, పీవీ మలేరియాతో పాటు రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. రక్తం నాలుగు పాయింట్లే ఉండడంతో గురువారం కేజీహెచ్‌కు రెఫర్‌ చేశారు. దీంతో హుటాహుటిన పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు అఖిల్‌ను విశాఖకు కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడు అక్కడ వైద్య సేవలు పొందుతున్నాడు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏటీడబ్ల్యూవో రజని తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 11:44 PM