Share News

Tribal Student గిరిజన విద్యార్థికి విష పురుగు కాటు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:46 PM

Tribal Student Bitten by Venomous Insect ఆర్‌ఆర్‌బీ పురం జీటీ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థికి విష పురుగు కాటేసింది. దీంతో హుటాహుటిన జిల్లాకేంద్రాసు పత్రికి తరలిచండంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం విద్యార్థి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

Tribal Student  గిరిజన విద్యార్థికి విష పురుగు కాటు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి

  • జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స.. కోలుకుంటున్న విద్యార్థి

జియ్యమ్మవలస, జూలై28(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఆర్‌బీ పురం జీటీ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థికి విష పురుగు కాటేసింది. దీంతో హుటాహుటిన జిల్లాకేంద్రాసు పత్రికి తరలిచండంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం విద్యార్థి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం భోజనాలు చేసి డార్మిటరీకి వస్తున్న ఐదో తరగతి విద్యార్థి పి.అభి గుండెపై ఏదో పురుగుకరిచింది. దీంతో గట్టిగా కేకలు వేస్తూ కుప్పకూలాడు. అక్కడే ఉన్న పాఠశాల హెచ్‌ఎం ఎన్‌.తిరుపతి, డిప్యూటీ వార్డెన్‌ ఎల్‌.గణపతిరావు వెంటనే బాలుడిని సమీప పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంపై పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య సేవలు పొందుతున్న విద్యార్థి పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు స్వగ్రామం బల్లేరుగూడ నుంచి విద్యార్థి తల్లి పత్తిక లక్ష్మి, బంధువులు ఆసుపత్రికి తరలివచ్చారు. హెచ్‌ఎం, డిప్యూటీ వార్డెన్‌తో కలిసి సోమవారం రాత్రంతా విద్యార్థితో ఉన్నారు. కాగా బాలుడు ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. వర్షాలు కురుస్తుండడం వల్ల పాఠశాలల్లోకి విషపురుగులు, సర్పాలు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:47 PM