గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:16 AM
ss
బెలగాం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించి నిరసన తెలిపారు. అనంతరం గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ అకాలవర్షంతో నష్టపోతున్న జీడి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతల సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఫసీతంపేట రూరల్,ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమస్యలను పరిష్కరిం చాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నాచేపట్టారు. తొలుత గిరిజన సంఘం ఆధ్వర్యంలోఐటీడీఏ కార్యాల యం వరకు గిరిజనులు ర్యాలీ చేపట్టారు.అనంతరం సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనసంఘం నాయకులు తిరుపతిరావు, లక్ష్మణరావు, శ్రీరాములులు మాట్లాడుతూు జీడిపిక్కలు కేజీకి రూ.200ధర కల్పిం చి జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్‌ను అందజేశారు.