Tribal Man Dies అనుమానాస్పద స్థితిలో గిరిజనుడి మృతి
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:23 PM
Tribal Man Dies Under Suspicious Circumstances నార్లవలస గ్రామానికి చెందిన చిక్కుడు సర్చునాయుడు (66)అనే గిరిజనుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాలూరు, ఏప్రిల్23(ఆంధ్రజ్యోతి): నార్లవలస గ్రామానికి చెందిన చిక్కుడు సర్చునాయుడు (66)అనే గిరిజనుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 21న ఒడిశా రాష్ట్రం సుంకి గ్రామంలో ఉన్న తమ బంధువు వద్దకు సర్చునాయుడు వెళ్లాడు. మరుసటిరోజు బుధవారం ఉదయం 9 గంటలకు వాళ్ల బంధువులు తిరిగి ఆయన్ని బస్సు ఎక్కించి స్వగ్రామానికి పంపించారు. అయితే సర్చునాయుడు ఇంటికి చేరుకోలేదు. మధ్యాహం 12 గంటల సమయంలో మామిడిపల్లి నుంచి పసుపువానివలసకు వెళ్లే మార్గంలో కాజ్‌వే వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయం తెలుసు కున్న కుమారుడు ఆ ప్రాంతానికి చేరుకుని చూడగా.. అప్పటికే సర్చు నాయుడు మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు తమ సిబ్బందితో అక్కడకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.