Tribal Festivities ఆదివాసీ సంబరం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:12 AM
Tribal Festivities ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘాలు, అధికా రులు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు.
అడవితల్లికి పాలభిషేకం చేసిన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పట్టు వస్ర్తాలు సమర్పించిన ఐటీడీఏ పీవోలు
పార్వతీపురం టౌన్, ఆగస్టు8(ఆంఽధ్రజ్యోతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘాలు, అధికా రులు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. థింసా నృత్యాలు, డప్పులు, వాయిద్యాలతో ర్యాలీ కొనసాగింది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీవోలు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌లు గిరిజన వేషధారణలతో అందర్నీ ఆకట్టుకున్నారు. గిరిజనులతో కలిసి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా గిరిజన యువతీ, యువకులు, ఐటీడీఏ పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ‘ అడవి తల్లికి జైజై’ అంటూ గూడెం , అరకు థింసారే తదితర థింసా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ముందుగా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణలోని అడవితల్లి విగ్రహానికి పీవోలు ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాల మధ్య పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అడవితల్లి విగ్రహానికి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పాలభిషేకం చేశారు. గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు హారతులు ఇచ్చి అటవీ ఉత్పత్తులను సమర్పించారు. అనంతరం వారంతా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటచేసిన సభకు బయల్దేరారు.