Tribal కదంతొక్కిన గిరిజనం
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:55 PM
Tribal Community Rises in Protest రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీలు ఏకమయ్యారు. సోమవారం చలో సీతంపేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేఏసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సీతంపేట వారపు సంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
సీతంపేటలో భారీ ర్యాలీ
సీతంపేట, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీలు ఏకమయ్యారు. సోమవారం చలో సీతంపేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేఏసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సీతంపేట వారపు సంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయ ప్రధాన గేటు వద్ద ఉన్న అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో బైఠాయించి నినాదాలు చేశారు. హక్కులను కాలరాసేలా చూస్తే ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు తెలిపారు. జీవో నెం.3కు చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ రక్షణ కల్పించాలని, షెడ్యూల్డ్ ప్రాంత ప్రత్యేక రిజర్వేషన్ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. 1/70(ఎల్‌టీఆర్)చట్టాన్ని యఽథావిధిగా కొనసాగించాలని, ఆదివాసీ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని నినదించారు. ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించిన హైకోర్టు పూర్వ న్యాయమూర్తి, జైభీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణకుమార్ మాట్లాడుతూ.. గిరిజన చట్టాలను ప్రభుత్వాలు గౌరవించడం లేదన్నారు. ఆదివాసీల హక్కులు,చట్టాల అమలు కోసం ఎన్నో వ్యాజ్యాలు న్యాయస్థానాల్లో వేసినట్లు తెలిపారు. అనంతరం ఆదివాసీల డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్‌కు విఅందించారు.