Share News

జ్వరంతో గిరిజన బాలుడి మృతి

ABN , Publish Date - May 24 , 2026 | 11:55 PM

గుజ్జులగండ గ్రామానికి చెందిన గిరిజన బాలుడు నిమ్మక వరుణ్‌ తేజ్‌ (4) జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

 జ్వరంతో గిరిజన బాలుడి మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు

కురుపాం రూరల్‌/కురుపాం, మే24 (ఆంధ్రజ్యోతి): గుజ్జులగండ గ్రామానికి చెందిన గిరిజన బాలుడు నిమ్మక వరుణ్‌ తేజ్‌ (4) జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. బిడ్డకు జ్వరం రావడంతో నిమ్మక కియ్య, జయసుధ శనివారం సాయంత్రం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం బాలుడికి ఫిట్స్‌ వచ్చింది. దాంతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సందీప్‌కుమార్‌ బాలుడుకు పరీక్షలు నిర్వహిచామని, మలేరియా లేదని తెలిపారు.

Updated Date - May 24 , 2026 | 11:55 PM