Share News

‘Model Villages’ ‘ మోడల్‌ విలేజ్‌’గా గిరిజన ప్రాంతాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:45 PM

Tribal Areas to Be Developed as ‘Model Villages’ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలక అడుగు పడింది. ప్రధానంగా పీవీటీజీలు నివసించే గ్రామాలను మోడల్‌ విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గదబ, సవర వంటి తెగలకు చెందిన గిరిజనుల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు కేటాయించనున్నారు.

  ‘Model Villages’ ‘ మోడల్‌ విలేజ్‌’గా గిరిజన ప్రాంతాలు
మంచాడవలసలో గిరిజనులతో మాట్లాడుతున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

  • జిల్లాలో మంచాడవలసను ఎంపిక చేసిన అధికారులు

పార్వతీపురం/పాచిపెంట, ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలక అడుగు పడింది. ప్రధానంగా పీవీటీజీలు నివసించే గ్రామాలను మోడల్‌ విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గదబ, సవర వంటి తెగలకు చెందిన గిరిజనుల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు కేటాయించనున్నారు. ఈ ఇళ్లను ఆధునిక పద్ధతులతో పాటు గిరిజన ఆచారాలకు అనుగుణంగా (ట్రైబల్‌ ఆర్కిటెక్చర్‌) నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కనీసం 50 ఇళ్లు ఒకే చోట ఉండే గ్రామాలను ఎంపిక చేసి.. అక్కడ పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి మోడల్‌ విలేజ్‌గా మార్చనున్నారు. ఈ పథకం అమలులో భాగంగా పాచిపెంట మండలంలోని మంచాడ వలస గ్రామాన్ని అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేశారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడ నివసిస్తున్న వారి ప్రస్తుత పరిస్థితులు, ఇళ్ల అవసరం, భౌగోళిక వాతావరణాన్ని పరిశీలించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. త్వరలోనే మోడల్‌ విలేజ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 11:45 PM