7న పారాది వంతెనపై ట్రయల్ రన్
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:26 AM
పారాది వద్ద వంతెనపై 7న ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): పారాది వద్ద వంతెనపై 7న ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. మంగళవారం వంతెన నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. బొబ్బిలి ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలో సాకారం కానుందన్నారు. అతి త్వరలో ప్రజ లకు వంతెనను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సహకారంతో వంతెన పనులు పూర్తి చేయ గలిగామన్నారు. గతంలో సుజయ్ నాయన మంత్రిగా ఉన్న సమయంలో మంజూరైన వంతెనను, తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పారాదిలో భూముల రీసర్వే ప్రక్రి యపై మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖం డించారు. రీ-సర్వేపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో భూ రీసర్వే పేరుతో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే కూటమి బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. సాంకేతిక కారాణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పాసుపుస్తకాల జారీ ప్రక్రియలో కొంత జాప్యం జరిగి ఉంటుందే గానీ రీ సర్వే నిలిచి పోలేదన్నారు.