Share News

Trees felled.. pillars toppled. చెట్లు నేలవాలి.. స్తంభాలు కూలి

ABN , Publish Date - May 23 , 2026 | 11:45 PM

Trees felled.. pillars toppled. గాలులు బీభత్సం సృష్టించాయి. చిన్న వానతో శుక్రవారం రాత్రి మొదలై కొద్ది క్షణాల్లో పెను గాలులుగా మారాయి. దీంతో వ్యవసాయ, విద్యుత్‌శాఖలకు తీవ్ర నష్టం కలిగింది. ఉద్యాన పంటలు నేలవాలాయి. ఎక్కడికక్కడే విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. శనివారం సాయంత్రానికి కూడా చాలా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంటల నష్టాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Trees  felled.. pillars toppled. చెట్లు నేలవాలి.. స్తంభాలు కూలి
రామబద్రపురంలో నేలకొరిగిన బొప్పాయి మొక్కలు

చెట్లు నేలవాలి.. స్తంభాలు కూలి

జిల్లాలో పెనుగాలుల బీభత్సం

ఉద్యాన పంటలు, విద్యుత్‌ శాఖకు నష్టం

కొనసాగుతున్న విద్యుత్‌ పునరుద్ధరణ పనులు

గాలులు బీభత్సం సృష్టించాయి. చిన్న వానతో శుక్రవారం రాత్రి మొదలై కొద్ది క్షణాల్లో పెను గాలులుగా మారాయి. దీంతో వ్యవసాయ, విద్యుత్‌శాఖలకు తీవ్ర నష్టం కలిగింది. ఉద్యాన పంటలు నేలవాలాయి. ఎక్కడికక్కడే విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. శనివారం సాయంత్రానికి కూడా చాలా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంటల నష్టాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

విజయనగరం, మే 23 (ఆంధ్రజ్యోతి):

మేఘం కమ్మిందంటే వర్షం కంటే గాలి భయమే అందరికీ పట్టుకుంది. ఏ చెట్టు కూలుతుందో.. ఏ స్తంభం పడుతుందోనని టెన్షన్‌ పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఇదే జరిగింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పాటు విపరీతమైన గాలి మొదలైంది. పట్టణాల్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు, చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. దీంతో జిల్లా అంతటా అంధకారం అలముకుంది. మరోవైపు విద్యుత్‌ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా ఇచ్చారు. శనివారం ఉదయం కూడా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ లేదు. రాత్రి 8 గంటల నాటికి శత శాతం పనులు పూర్తిచేశామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ లక్ష్మణ్‌ రావు తెలిపారు. విద్యుత్‌శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 600 వరకు స్తంభాలు నేలకొరిగాయని సమచారం. 15 ట్రాన్స్‌ఫార్మర్స్‌, సుమారు 5 కిలోమీటర్ల పొడవు విద్యుత్‌ తీగలు తెగికిందపడ్డాయి. 200కు పైగా చెట్ల కొమ్మలు కరెంటు వైర్లపై విరిగిపడ్డాయి. వ్యవసాయశాఖకు సంబంధించి 27 మండలాల్లో 38 ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. బొప్పాయి, అరటి, మామిడి, కాయగూరలు దెబ్బతిన్నాయి. నష్టానికి సంబంధించిన నివేదికను జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయనున్నట్టు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు.

--------------------

Updated Date - May 23 , 2026 | 11:45 PM