Transparent Services Through PACS పీఏసీఎస్‌ల ద్వారా పారదర్శక సేవలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:36 PM
Transparent Services Through PACS జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటీకరించి పారదర్శక సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో సమీక్షించారు.
పార్వతీపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటీకరించి పారదర్శక సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో సమీక్షించారు. ‘ జిల్లాలోని 42 పీఏసీఎస్‌ల్లో కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్‌లైన్ ద్వారానే సాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ-ఆడిట్ ప్ర క్రియ కూడా విజయవంతంగా పూర్తయింది. విజయనగరం డీసీసీబీ పరిధిలోని 34 సంఘాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది సంఘాల రోజువారి లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించాలి. గిరిజన రైతుల కోసం గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలో పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే అవి రిజిస్టర్ అయ్యాయి. ’ అని జేసీ తెలిపారు.
పాస్‌పుస్తకాలు జారీ వేగవంతం
జిల్లాలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలను అధిగమించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎనిమిది మండలాల రెవెన్యూ అధికారు లతోసమీక్షించారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్‌పుస్తకాల వెరిఫికేషన్, సాఫ్ట్‌వేర్ పనితీరుపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో గ్రామ సర్వేయర్లు భూమిని ఎలా పరిశీలించాలి? తప్పులు లేకుండా డేటా ఎలా నమోదు చేయాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి.. అర్హులైన రైతులకు పాస్‌బుక్‌లు అందేలా చూడాలని జేసీ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు ఉన్నారు.