Share News

Anganwadi Posts పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

ABN , Publish Date - May 20 , 2026 | 11:27 PM

Transparent Recruitment of Anganwadi Posts జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులు భర్తీ కోసం బుధవారం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ నాన్‌-టీస్పీ పోస్టుల అభ్యర్థులకు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

 Anganwadi Posts పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ
కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న జేసీ

పార్వతీపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులు భర్తీ కోసం బుధవారం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ నాన్‌-టీస్పీ పోస్టుల అభ్యర్థులకు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఇంటర్వ్యూలు నిర్వహించారు. పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బలిజిపేట, కొమరాడ, పాలకొండ, భామిని మండలాల్లో మొత్తంగా 31 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలకు 65 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారని ఆయన వెల్లడించారు. పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందన్నారు. ఫలితాల ప్రకటనపై సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అంతకముందు సెలక్షన్‌ కమిటీ సభ్యులు, అధికారుల బృందం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.

హెల్పర్‌ పోస్టులకు ...

ఐటీడీఏ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న హెల్పర్‌ పోస్టుల భర్తీకి బుధవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పీవో ఆర్‌.వైశాలి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఎనిమిది మండలాల్లో మొత్తం 172 హెల్పర్‌ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొదటి విడతగా 122 హెల్పర్‌ పోస్టులకు గాను 289 దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్వ్యూకు వారంతా హాజరయ్యారు. ఐటీడీఏ అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, సర్టిఫికెట్లను పరిశీలించారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని పీవో తెలిపారు.

- సీతంపేట ఐటీడీఏ పరిధిలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాలకు చెందిన అభ్యర్థులు హాజరుకానున్నారు.

Updated Date - May 20 , 2026 | 11:27 PM