Census పారదర్శకంగా జనగణన
ABN , Publish Date - May 15 , 2026 | 11:40 PM
Transparent Census Process జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్, సాలూరు మున్సిపల్ ప్రత్యేకాధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాలూరులో చేట్టిన జన, గృహ గణన ప్రక్రియను పరిశీలించారు.
సాలూరు, మే 15(ఆంధ్రజ్యోతి): జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్, సాలూరు మున్సిపల్ ప్రత్యేకాధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాలూరులో చేట్టిన జన, గృహ గణన ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేటర్లతో మాట్లాడి.. వివరాల నమోదుపై ఆరా తీశారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది తప్పులకు తావు లేకుండా.. ప్రతి ఇంటి వివరాలను క్షుణ్నంగా నమోదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా జనగణన సిబ్బందికి సహకరించి , సరైన వివరాలు అందజేయాలని కోరారు. ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యూ మరేషన్ చేసుకున్న వారు తమ ఐడీలను ఎన్యూమరేటర్లకు అందజేయాలన్నారు. నిర్దేశించిన గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్, రెవెన్యూ, మున్సిపల్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.