Share News

Bar Licenses పారదర్శకంగా బార్‌ లైసెన్స్‌ల కేటాయింపు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:40 PM

Transparent Allocation of Bar Licenses జిల్లాలో బార్‌ లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. పార్వతీపురం, సాలూరు పట్టణాలకు సంబంధించిన నాలుగు బార్ల కేటాయింపు ప్రక్రియను గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు.

 Bar Licenses పారదర్శకంగా బార్‌ లైసెన్స్‌ల కేటాయింపు
లాటరీ నిర్వహిస్తున్న డీఆర్వో

పార్వతీపురం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బార్‌ లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. పార్వతీపురం, సాలూరు పట్టణాలకు సంబంధించిన నాలుగు బార్ల కేటాయింపు ప్రక్రియను గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. తొలుత డీఆర్వో లాటరీ తీసి బహిరంగంగా దరఖాస్తుదారులకు చూపించారు. మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకోగా, పార్వతీపురంలోని మూడు బార్లను, సాలూరు పట్టణ పరిధిలో ఒక బారుకు డ్రా ద్వారా లైసెన్స్‌లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎ.సంతోష్‌, ఆ శాఖాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:40 PM