రిజిస్ట్రేషన్లలో పారదర్శకత అవసరం’
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:18 AM
రిజిస్ర్టేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
పార్వతీపురం/ బెలగాం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం పార్వతీపురం పట్టణంలోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలిం చి రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదారులతో మాట్లాడారు. ప్రభు త్వం అందిస్తున్న సేవల సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేషన్ ఫీజుల వసూళ్లపై సమీక్షించారు. వేసవి దృష్ట్యా కార్యాలయ ప్రాంగణంలో తాగునీరు, నీడ వంటి కనీస వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.