Entrance Examinations ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:00 AM
Training Should Be Provided for Entrance Examinations నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వేమూరి హరగోపాల్ సూచించారు. విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.
పాలకొండ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వేమూరి హరగోపాల్ సూచించారు. విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. రోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలు పెట్టాలన్నారు. వారి హాజరుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. వరుసగా రెండు రోజులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కళాశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, మొక్కలు నాటాలని, విద్యార్థులతో ప్రతి పీరియడ్‌లో ఐదు నిమిషాలు వ్యాయామం చేయించాలని తెలిపారు. ప్రాక్టికల్ తరగతులను ఇప్పటి నుంచే నిర్వహించాలని, మధ్యాహ్న భోజనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పైల శంకరరావు సిబ్బంది ఉన్నారు.