Share News

VBG Ramji వీబీ జీ రామ్‌జీపై ఎంపీడీవోలకు శిక్షణ

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:59 PM

Training for MPDOs on VBG Ramji Programme వీబీ జీ రామ్‌జీపై (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌ )ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎంపీడీవోలు శిక్షణకు వెళ్లనున్నారు. వచ్చనెల నుంచి నూతన చట్టం అమలులోకి రానున్న దృష్ట్యా పూర్తిస్థాయిలో అవగాహనకు ఎంపీడీవోలకు సామర్లకోటలోని శిక్షణ అందించనున్నారు.

 VBG Ramji   వీబీ జీ రామ్‌జీపై  ఎంపీడీవోలకు శిక్షణ

గరుగుబిల్లి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): వీబీ జీ రామ్‌జీపై (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌ )ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎంపీడీవోలు శిక్షణకు వెళ్లనున్నారు. వచ్చనెల నుంచి నూతన చట్టం అమలులోకి రానున్న దృష్ట్యా పూర్తిస్థాయిలో అవగాహనకు ఎంపీడీవోలకు సామర్లకోటలోని శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు జడ్పీ సీఈవో ఇ.నాగలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో ఈ నెల 23 నుంచి సాలూరు, గరుగుబిల్లి, బాడంగి, భోగాపురం, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, డెంకాడ మండలాలకు, 30 నుంచి రెండో విడతలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మెంటాడ, మొరకముడిదాం, పూసపాటిరేగ, రామభద్రపురం మండలాలకు శిక్షణ ఇస్తారు. జూలై 2 నుంచి మూడో విడతలో మక్కువ, పాచిపెంట, ఎస్‌.కోట, తెర్లాం, వేపాడ, విజయనగరం మండలాలకు, జూలై 7 నుంచి నాలుగో విడతలో కొమరాడ, బలిజిపేట, పార్వతీపురం, సీతానగరం, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్‌.కోట మండలాలకు చెందిన ఎంపీడీవోలకు శిక్షణ అందించనున్నారు. ఆయా మండలాల్లో వారి స్థానంలో డిప్యూటీ ఎంపీడీవోలు, ఏవోలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శిక్షణ పూర్తయిన తర్వాత ఎంపీడీవోలు మండల స్థాయిలో సిబ్బందికి కొత్త చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉంది.

Updated Date - Jun 22 , 2026 | 11:59 PM